ఇండియాతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లాండ్ సీక్రెట్స్ బయటపెట్టిన ఆ జట్టు బౌలర్?

praveen
ప్రస్తుతం వరుసగా ధైపాక్షక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న టీమిండియా.. ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ఇక మంచి పాయింట్లు సాధించి ముందుకు వెళ్లడానికి టీమ్ ఇండియాకు ఈ టెస్ట్ సిరీస్ ఎంతో కీలకమని చెప్పాలి. అదే సమయంలో బజ్ బాల్ అనే కొత్త విధానంతో సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో కూడా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధులను వణికిస్తూ వస్తుంది ఇంగ్లాండ్ జట్టు. పలుమార్లు విఫలమైనప్పటికీ తమ ఆట తీరును మాత్రం ఎక్కడ మార్చుకోవట్లేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక ప్రపంచ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయం అనేది తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే భారత పిచ్ లపై పూర్తి అవగాహన ఉన్న టీమిండియా.. ఇక పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డపై కఠినమైన సవాలు విసిరే టీమిండియాను ఎదుర్కొనేందుకు.. అటు ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి ప్లాన్స్ తో బరిలోకి దిగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే అటు ఇంగ్లాండ్ బౌలర్ ఆ జట్టు వ్యూహాలను మొత్తం బయటపెట్టేసాడు. భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు టీం ఇద్దరు స్పిన్నర్లతో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని ఆ జట్టు సీనియర్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ చెప్పుకొచ్చాడు. ఆతిథ్య దేశంలోని పిచ్ లు స్పిన్ బౌలింగ్కు అనుకూలించేవి కావడంతో స్పిన్నర్లతో పోరాటం మొదలు పెట్టవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా భారత పర్యటనలో.. జాక్ లీచ్, రెహన్ అహ్మద్, టామ్ హర్త్లీ, షోయబ్ బషీర్ ఇంగ్లాండ్ జడ్డులో పాల్గొనే అవకాశం ఉంది. ఇక వీరిలో అవుతుంది తుది జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: