అబ్బబ్బా.. ఏం ఉత్కంఠ.. టి20 మ్యాచ్ అంటే ఇలా ఉండాలి?

praveen
టి20 ఫార్మాట్ కి అటు ప్రపంచ క్రికెట్లో రోజురోజుకు క్రేజ్ ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పొట్టి ఫార్మాట్ కి ఇంతలా క్రేజ్ పెరిగిపోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. టెస్ట్ ఫార్మాట్లో లాగా ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. వన్ డే ఫార్మాట్లో లాగా ఒక రోజు మొత్తం ఇక మ్యాచ్ చూడాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇక మ్యాచ్ ఫలితం ఏంటో తేలిపోతుంది. అదే సమయంలో ఇక ప్రేక్షకులందరికీ కావాల్సిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి.

 అంతేకాదు చివరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటుంది మ్యాచ్. అందుకే ప్రేక్షకులు అందరూ కూడా ఈ టి20 ఫార్మాట్ ని ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని టి20 మ్యాచ్ లలో ఏదో ఒక జట్టు ఆదిపత్యం చలాయించి ఇక విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇంకోన్ని టి20 మ్యాచ్లలో మాత్రం ఇక ప్రేక్షకులందరినీ ముని వేళ్ళపై నిలబెట్టగలిగే ఉత్కంఠ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది.

 ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 212/4 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత చేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా చెలరేగిపోయింది. 212/6 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఇక రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు ఎంపైర్లు. అయితే సూపర్ ఓవర్ లో ఇరు జట్లు కూడా 16 పరుగులు చేశాయి. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరికి రెండో సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో సూపర్ ఓవర్లో అటు టీమిండియా 11 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ ఒక పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఉత్కంఠ భరితమైన పోరులో రెండో సూపర్ ఓవర్లు టీమ్ ఇండియాను విజయం వరించింది. కాగా ఈ మ్యాచ్ చూసిన ప్రేక్షకులు టి20 మ్యాచ్ అంటే ఇలా ఉండాలి.. ఎన్నాళ్ళకి ఇలాంటి మ్యాచ్ చూసాం అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: