సిక్సర్ల వీరుడు శివం దూబే.. లవ్ స్టోరీ గురించి తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే ఆల్రౌండర్ శివం దూబే అని చెప్పాలి  అయితే హార్దిక్ పాండ్యా లాగానే టీమ్ ఇండియాకు మరో ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో కోరుకున్నారు. ఎందుకంటే ఇక బ్యాటింగ్లో మెరుపులు మెరూపించడంతో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టాలని అనుకున్నారు. హార్థిక్ పాండ్యా ఒక్కడే అలాంటి ఆటగాడు అందుబాటులో ఉండడంతో అతను గాయం బారిన పడ్డప్పుడల్లా ఇక టీమిండియా వ్యూహాలు తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అతనిలాంటి ఆటగాడు ఎవరైనా మళ్లీ టీమిండియా కు దొరుకుతాడు అని అందరూ ఆలోచనలో పడిపోయిన సమయంలో శివం దుబే హార్దిక్ పాండ్యాకు నేనే ప్రత్యామ్నయం అనే విషయాన్ని తన బ్యాటింగ్ తో అర్థమయ్యేలా చేశాడు. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇండియాన్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి   ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టి20 సిరీస్లో ఏకంగా మొదటి మ్యాచ్లో 60 పరుగులు రెండో మ్యాచ్లో కూడా 63 కి పైగా పరుగులు చేసి జట్టు విజయాలను కీలక పాత్ర వహించాడు.

 ఈ క్రమంలోనే అతని వరల్డ్ కప్ టోర్నీలో ఎంపిక చేయడం ఖాయమని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇక శివం దూబే గురించి అన్ని విషయాలను తెలుసుకునేందుకు భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే శివం దూబేకి పెళ్లయింది యూపీ కి చెందిన అంజుమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఈవెంట్ లో దూబేకి పరిచయం ఏర్పడింది  మతాలు వేరుకోవడంతో వీరు పెళ్లికి పేరెంట్స్ అభ్యంతరం చెప్పగా.. ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళను ఒప్పించి గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: