హార్దిక్ కి కెప్టెన్సీ ఇవ్వడానికి ఇదే కారణం.. యువరాజ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఐపీఎల్ లో ఉన్న మిగతా టీమ్స్ అన్ని కూడా రోహిత్ లాంటి సారథి కావాలని అలాంటి వాడు.. వస్తే కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకుంటాం అని అనుకుంటూ ఉంటే.. ముంబై ఇండియన్స్ కు అయిదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం.

 ఏకంగా గుజరాత్ జట్టు నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొని మరి అతని చేతిలో కెప్టెన్సీ పెట్టింది. ఈ విషయాన్ని అటు రోహిత్ శర్మ అభిమానులు అందరూ కూడా అస్సలు జీర్ణించుకోలేకపోయారు అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ  పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీలు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేశారు. ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై భారత మాజీ ఆల్ రౌండర్  యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. క్రికెట్లో ప్రతి ప్లేయర్ ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు.

 ఫ్రాంచైజీ క్రికెట్లో యువ ప్రతిభావంతుల కోసం ఎప్పటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది అంటూ తెలిపాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో వయస్సు పెరిగే కొద్దీ కష్టాలు తప్పవు అంటూ తెలిపాడు. ప్రతి ఫ్రాంచైజీ యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని చూస్తుందని వారి కోసమే ఎక్కువగా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ అపార అనుభవం గత విజయాలను ప్రస్తావించిన యువరాజ్ సింగ్ ఫ్రాంచైజీలు దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. పోటీ పెరుగుతున్న కొద్ది రోహిత్ విరాట్ లాంటి ఆటగాళ్లు నైపుణ్యాలు పరిజ్ఞానం ఏ జట్టుకైనా అమూల్యమైన ఆస్తులు అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: