నాలో ఉన్న ఆ క్వాలిటీ.. సచిన్, ధోని, కోహ్లీలో లేదు : గంగూలీ

praveen
భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఒకరు అన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ క్రికెట్ కి సేవలు అందించారు ఆయన. ఇక ఇప్పుడు ఆయనను స్పూర్తిగా తీసుకొని ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ లిస్టులో ఉన్నాడు అని చెప్పాలి. 1983 తర్వాత భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా తన కెప్టెన్సీలో రెండు సార్లు అందించాడు. ఇక వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషిర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు.

 నేటి జనరేషన్ నుంచి అటు విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్టులో ఇప్పటికే చేరిపోయాడు. ఒకప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇక విరాట్ కోహ్లీని మించిన క్రికెటర్ మరొకరు రాలేడేమో అనేంతలా తన ఆట తీరుతో ప్రత్యేకమైన రికార్డులు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఆటతోనే కాదు తన యాటిట్యూడ్ తో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కోహ్లీ ఎంత తోపు మాటల్లో చెప్పడం కూడా కష్టమే. అయితే ఈ ముగ్గురు క్రికెటర్ల గురించి చెప్పమంటే ఎవరైనా సరే గొప్పగా చెబుతూ ఉంటారు.

 కానీ బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ మాత్రం ఈ ముగ్గురు లెజెండ్స్ లో లేని క్వాలిటీ తనలో ఉందని ఒక నెగిటివ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గంగూలీ. సచిన్, ధోని, విరాట్ కోహ్లీ నుంచి మీరు ఏ క్వాలిటీ లను తీసుకుంటారు అని ప్రశ్నించగా.. సచిన్ నుంచి గొప్పతనం కోహ్లీ నుంచి దూకుడు ధోని నుంచి ప్రశాంతత అనే క్వాలిటీని తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీలో ఉండే ఏ క్వాలిటీ ఆ ముగ్గురిలో లేదు అంటూ ప్రశ్నిస్తే.. నేను ఏ విషయంలోనైనా అడ్జస్ట్ అవుతాను. కానీ వారిలో అడ్జస్ట్మెంట్ అనే క్వాలిటీ లేదు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: