ఇంగ్లాండ్ తో సిరీస్ కు.. టీమిండియాకు కొత్త వికెట్ కీపర్.. ఎవరంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడబోతుంది  అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత పర్యటనకు రాబోతున్న ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్లో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ముందుకు సాగేందుకు.. ఇక ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం కాబోతుంది అని చెప్పాలి.

 అయితే ఇదే ఏడాది టి20 వరల్డ్ కప్ టోర్నీ కూడా ఉండడం గమనార్హం. అయితే ఇక ఈ బిజీ షెడ్యూల్ నేపద్యంలో ఇక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు పక్క ప్రణాళిక ప్రకారం బీసీసీఐ ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో భారత జట్టులో పలు కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి భారత జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కు  కొన్నాళ్లపాటు బ్రేక్ ఇవ్వడానికి సెలెక్టర్లు నిర్ణయించారు.

 అయితే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడటంతో ప్రస్తుతం అతను అందుబాటులో లేడు. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ కి కూడా వికెట్ కీపర్ గా విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ కు అప్పగించాలని అనుకుంటున్నారట. అయితే కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మాత్రమే బరిలోకి దిగుతాడు అన్నది తెలుస్తుంది. కాగా ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదిక ఇక రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: