డబ్బులు కట్ అయినా.. చలాన్ క్లియర్ కాలేదా?

praveen
ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారుల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ సరైన పత్రాలు లేని వారికి చివరికి జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలోఎక్కడికక్కడ సిసి కెమెరాలు నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక పోలీసులు అక్కడ లేకపోయినా సీసీ కెమెరాలు ఫుటేజీ ఆధారంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇక చలాన్లు విధించడం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇటీవల కాలంలో పోలీసులు విధించిన చలాన్ లను చాలా మంది వాహనదారులు కట్టకుండా అలాగే వదిలేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది  ఇక భారీగా రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్లకు పైగా చలాన్లు వసూలు అయ్యాయి. ఇక ఇటీవలే డిసెంబర్ 26వ తేదీన మరోసారి ఇలాంటి ఆవరణ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇక ఈ రాయితీని వినియోగించుకొని తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ లు అన్నింటినీ కూడా వాహన యజమానులు చెల్లిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 ఇప్పటికే పెండింగ్ చలాన్ల ద్వారా దాదాపు 100 కోట్లకు పైగానే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అన్నది తెలుస్తుంది. అయితే చలాన్ల చెల్లింపు విషయంలో కొంతమందికి మాత్రం చేదు అనుభవం ఎదురవుతుంది. పెండింగ్ లో ఉన్న చలాన్లను  చెల్లించేందుకు ప్రయత్నిస్తే అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయినప్పటికీ చలాన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. అయితే ఇలా సాంకేతిక సమస్య కారణంగా అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయి చలాన్లు క్లియర్ కాకపోతే ఒకరోజు వేచి చూడాలి. ఇక అప్పటికి మీ చలానా క్లియర్ కాకపోతే మీరు చెల్లించిన మొత్తం ఏడు వర్కింగ్ డేస్ లో మళ్ళీ మీ అకౌంట్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: