అల్ట్రా స్టైలిష్ లుక్ లో ధోని.. హీరోలాగే ఉన్నాడుగా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక లెజెండ్ గా ఎదిగిన ధోని ప్రస్థానం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. అయితే అప్పట్లో అద్భుతమైన ఆట తీరుతో అంతకుమించిన కెప్టెన్సీ తో అదరగొట్టి ఏకంగా టీమ్ ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు ధోని.

 ఇక మైదానంలో ఒత్తిడి సమయం లో కూడా ప్రశాంతంగా ఉంటూ తన ఆటిట్యూడ్ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోని క్రేజ్ మాత్రం ఇసుమంతైన తగ్గలేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మహేంద్ర సింగ్ ధోని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా లాంగ్ హెయిర్ తో హీరోలాగా ఉంటున్నాడు.

 వాస్తవానికి ధోని సోషల్ మీడియా లో అస్సలు యాక్టివ్ గా ఉండడు. కానీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు తెరమీదకి వస్తూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా ధోని అల్ట్రా స్టైలిష్ లుక్ లో సూటు బూటు వేసుకొని ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారి పోయింది. అయితే ఒక యాడ్ షూట్ కోసమే ఇక ధోని ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోగా.. మహి అభిమానులందరికీ కూడా ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ఐపిఎల్ గురించి ధోని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక వచ్చే నెల నుంచి సీఎస్కే క్యాంపులు మొదలు కాబోతున్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: