2023 ఏడాదిలో.. అత్యధిక టి20 మ్యాచ్ లు ఆడింది ఎవరో తెలుసా?

praveen
2023 ఏడాది ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లకు అద్వితీయమైన విజయాలు సొంతం అయితే.. ఇంకొంతమంది క్రికెటర్లకు మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన క్రికెట్ ప్రేక్షకులు ఆటగాళ్లు అందరూ కూడా ఇక గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఎవరు.. రికార్డులు సృష్టించిన ప్లేయర్లు ఎవరు అనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎంతో మంది మాజీ ప్లేయర్లు సైతం ఇక ఇదే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.

 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ సైతం ఇలా గత ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు గుర్తింపుగా అవార్డులను ప్రకటించడం కూడా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక గత ఏడాది మొత్తంలో అందరికంటే ఎక్కువగా టి20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఈ లిస్టులో ఇంగ్లాండు స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ 59 టీ20 మ్యాచ్ లు ఆడి అందరిని వెనక్కి నెట్టి టాప్ లో నిలిచాడు. అయితే కేవలం అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే కాదు ఇక అన్ని లీగ్స్ కి సంబంధించిన మ్యాచ్ లు కలుపుకొని 59 t20 మ్యాచ్ లు ఆడాడు సామ్ కరణ్.

 ఈ క్రమంలోనే 2023 ఏడాది మొత్తంలో అత్యధిక టి20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్గా నిలిచాడు  అయితే అతడి తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ 56 t20 మ్యాచ్ లు ఆడి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక వీరిద్దరి తర్వాత నాథన్ ఎల్లిస్ 53 మ్యాచ్ లు, ట్రావిస్ హెడ్ 52 మ్యాచ్లు, జమాన్ ఖాన్ 50 మ్యాచ్ లు, ఫిల్ సాల్ట్ 49 మ్యాచులు, ఇమాద్ వసీం 48 మ్యాచులు, డేవిడ్ మిల్లర్ 48 మ్యాచులు, సునీల్ నరైన్ 48, రషీద్ ఖాన్ 48, ఆజాం ఖాన్ 47, అర్షదీప్ 44 టి20 మ్యాచ్ లు ఆడి ఈ లిస్టులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: