అదే స్పీడ్, అదే స్వింగ్.. భారత క్రికెట్లోకి షమీ తమ్ముడు?

praveen
టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మహమ్మద్ షమీ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన ఆట తీరుతో ఇప్పటికే అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. ఈ సీనియర్ ప్లేయర్ అయితే దాదాపు దశాబ్ద కాలం నుంచి టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అన్ని సవాళ్లను స్వీకరిస్తూ ఇక ఇప్పుడు ఇక అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు.

 అయితే ఎంతటి స్టార్ బ్యాట్స్మెన్ ను అయినా సరే మహమ్మద్ షమి తన స్వింగ్ బౌలింగ్ తో బోల్తా కొట్టించి వికెట్ దక్కించుకోగలడు అని చెప్పాలి. అయితే ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో షమీ ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదృష్టవశాత్తు హార్తిక్ పాండ్య గాయపడటంతో జట్టులో చోటు సంపాదించుకున్న ఈ ఆటగాడు... ఇక ఆ తర్వాత టీమ్ ఇండియాకి అదృష్టంగా మారిపోయాడు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ వికెట్లు పడగొట్టి ఇక వరల్డ్ కప్ టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు షమీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.

 ఇప్పటికే టీం ఇండియాలో తన సత్తా ఏంటో నిరూపించుకున్న మహమ్మద్ షమీ కుటుంబం నుంచి ఇక మరో బౌలర్ అటు భారత క్రికెట్లోకి అడుగు పెట్టాడు అన్నది తెలుస్తోంది.  షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరఫున రంజి టోర్నీలోకి అరంగేట్రం చేశాడు. లిస్టు ఏ క్రికెట్, విజయ హాజరేటోర్ని, బెంగాల్ టి20 టోర్నీలో ఇప్పటికే రాణించాడు. ఇక తన స్పీడ్, స్వింగ్ బౌలింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. తమ్ముడికి విలువైన సలహాలు ఇస్తూ అటు షమీ కూడా అండగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: