వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అవి దొరికేసాయట?

praveen
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ రిటైర్ అయిపోయాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తనుకు చివరిది అని ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఇటీవల ఇక పాకిస్తాన్తో మూడో టెస్ట్ మ్యాచ్ కూడా ముగిసింది. ఈ మూడు టెస్ట్ మ్యాచ్లలో కూడా ఆస్ట్రేలియా ఘనవిజయాన్ని సాధించింది. ఇక 3-0 తో పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసి డేవిడ్ వార్నర్  ఘనమైన వీడ్కోలుని  అందించింది. ఈ క్రమంలోనే ఇక అఫీషియల్ గా రిటైర్ అయిపోయాడు డేవిడ్ వార్నర్.

 అయితే ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే న్యూస్ అందింది. వార్నర్ రిటైర్ అయితే అది అభిమానులకు గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది అంటారా? అయితే రిటైర్మెంట్ విషయంలో కాదు మొన్నటికి మొన్న డేవిడ్ వార్నర్ తనకు ఎంతో సెంటిమెంట్ అయినా బ్యాగీ గ్రీన్ క్యాప్ లను పోగొట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మూడో టెస్ట్ కోసం మేల్ బోర్న్  నుండి సిడ్నీకి వస్తుండగా ఈ క్యాప్ లు మిస్ అయ్యాయి. 2011లో వార్నర్ తన అరంగేట్రం టెస్టులు ధరించిన భాగీ గ్రీన్ క్యాప్ ఇది.

 ఈ క్రమంలోనే కొత్త క్యాప్ లు కొనిస్తానని తనకు సెంటిమెంట్ ఆయన క్యాప్ లను తిరిగి ఇచ్చేయాలి అంటూ వార్నర్ రిక్వెస్ట్ చేశాడు. అయితే రిటైర్మెంట్ కి ముందు వార్నకు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడమేంటి అంటూ అభిమానులు కూడా ఆందోళన చెందారు. అయితే ఇక ఇప్పుడు ఈ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఎందుకంటే సిడ్నీలోని టీం హోటల్లో ఇక వార్నర్ క్యాప్ దొరికేసింది   ఇక ఈ క్యాప్ లను ఎవరు హోటల్లో వదిలి వెళ్లారు అన్నది తెలియదు  కానీ ఇది దొరికినందుకు ఇక వార్నర్ ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: