ఆ ప్లాన్ తోనే.. రెండో టెస్టులో బరిలోకి దిగాం : జైస్వాల్

praveen
టీమిండియా జట్టు 2024 కొత్త ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. 2023 ఏడాదిని సౌత్ ఆఫ్రికా చేతిలో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోర ఓటమి ద్వారా ముగించి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. ఇక కొత్త ఏడాదిని మాత్రం రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం ద్వారా ప్రారంభించింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టును చిత్తుగా ఓడించింది అన్న విషయం తెలిసిందే  ఇక ఈ విజయంతో చరిత్ర సృష్టించింది టీమిండియా.

 ఎందుకంటే కేప్ టౌన్ వేదికగా ఆసియా నుండి ఇప్పటి వరకు ఒక్క టీం టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించలేదు. మొదటిసారి భారత జట్టు ఇక సౌత్ ఆఫ్రికా ను కేప్ టౌన్ వేదికగా ఓడించి ఇక చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ లో కాస్త తడబడినట్లు కనిపించిన భారత బ్యాటింగ్ విభాగం ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం మంచి ప్రదర్శన చేసింది. పరిస్థితులకు తగ్గట్లుగా తమ బ్యాటింగ్ ను మార్చుకుంటూ ముందుకు సాగారు టీం ఇండియా ఆటగాళ్లు. రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఎంతో దూకుడుగా ఆడారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాము అనే విషయాన్ని యువ ఆటగాడు యశస్వి జైష్వాల్ ఇటీవల చెప్పుకొచ్చాడు.

 దక్షిణాఫ్రికా తో రెండో టెస్ట్ చివరి ఇన్నింగ్స్ లో టీమిండియా 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే భారత ఆటగాళ్లు దూకుడుగానే లక్ష్య చేదనను ముగించేశారు. అయితే ముందుగా అలా ప్లాన్ చేసుకునే బరిలోకి దిగాము అంటూ యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే ఆటగాళ్లు దూకుడుగా ఆడాలని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు  ఇక ఆ ఇన్నింగ్స్ ను పాజిటివ్గా ఆడాలని సూచించాడు. అయితే అలా అయితేనే ప్రత్యర్థి బౌలర్ల లయను చెడగొట్టగలం అంటూ తెలిపాడు. ఇక ఆయన చెప్పినట్లుగానే దూకుడు గాడి విజయం సాధించాం అంటూ జైష్వాల్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: