ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి అదరగొట్టాలి అనే ఆలోచనతోనే ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు ఇక రికార్డులు కొల్లగొట్టడం చేస్తూ ఉంటారు.  కొంతమంది ఆటగాళ్ళు అటు అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడి తట్టుకోలేక విఫలమైతే.. ఇంకొంతమంది మాత్రం ఒత్తిడిని చిత్తు చేస్తూ క్రికెట్ భవిష్యత్తు తామే అన్న విషయాన్ని కూడా నిరూపిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్ళను మరింత ప్రోత్సాహించడమే లక్ష్యంగా అటు బీసీసీఐ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ ని ప్రకటించడమే కాదు.. ఇక అవార్డులను ప్రకటించడం కూడా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఒక నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ళకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కట్టబెడుతూ ఉంటుంది. అలాగే ఇక ఒక ఏడాది మొత్తంలో నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు.. కూడా ఇక ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇప్పుడు 2023 ఏడాది ముగిసింది. ఈ ఏడాదిలో ఎంతోమంది ఆటగాళ్లకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. గడిచిన ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక 2023 ఏడాదికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఉండబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ అవార్డు రేసులో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు నిలిచారు. వీరితో పాటు ఆసిస్ కెప్టెన్ కమిన్స్, ఓపెనర్ ట్రావీస్ హెడ్ కూడా రేసులో ఉన్నారు అని చెప్పాలి. వీరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు అవార్డు దక్కించుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: