ఆ ఒక్క తప్పిదమే.. మా కొంప ముంచింది : ఎల్గర్

praveen
టీమిండియా జట్టు ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడింది. అయితే ఇటీవల చివర్లో జరిగిన టెస్ట్ సిరీస్ అయితే ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి. అయితే అప్పటివరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో జరిగిన వైపాక్షిక సిరీస్లలో జోరు చూపించిన టీమిండియా టెస్ట్ సిరీస్ లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్లో దారుణ పరాజయాన్ని  చవిచూసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది టీమిండియా.

 అయితే ఇటీవల కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది టీం ఇండియా. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది అని చెప్పాలి. అయితే భారత జట్టుకు ఇదే కేప్ టౌన్ వేదికగా మొదటి టెస్ట్ విజయం కావడం గమనార్హం. ఇక ఆసియా నుంచి కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికా వై విజయం సాధించిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది భారత్. అయితే ఇక రెండో మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించడంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1 తో సమమైంది. అయితే అనంతరం ఈ ఓటమిపై మాట్లాడిన సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు ఓడిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక టీమ్ ఇండియా గెలుపు క్రెడిట్ మొత్తం బౌలర్లకు ఇవ్వాలి అంటూ ప్రశంసించాడు. ఈ ఓటమి  నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఈ మ్యాచ్ లో ఓడినా మాకు కొన్ని సానుకూల అంశాలు లభించాయ్. తొలి ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి తప్ప లేదు. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. పిచ్ కండిషన్స్ ను చక్కగా ఉపయోగించుకుంది. సిరీస్ డ్రా అయినా మాకు అనేక సానుకూల అంశాలు లభించాయి. కుర్రాళ్ళ అద్భుత ప్రదర్శన కనపరిచారు. 2-0 సిరీస్ గెలిచి ఉంటే మరింత బాగుండేది. డ్రా అయినప్పటికీ కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గౌరవంగా ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మార్కరమ్ బ్యాటింగ్ చేసిన విధానం అయితే అసాధారణంగా ఉంది. ఈ పిచ్ ఫేస్ కు అనుకూలంగా ఉంది. కళ్ళను మోసం చేసింది. మామూలుగా చూసినప్పుడు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండేలా కనిపించింది. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఈ పిచ్ స్పందించింది అంటూ చెప్పుకొచ్చాడు ఎల్గర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: