వారెవ్వా.. చరిత్ర సృష్టించిన భారత జట్టు?

praveen
సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ ను 1-1 తో సమం చేసిన భారత జట్టు వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే ఇక రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను కూడా అటు భారత జట్టు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది  ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా విజయం సాధించలేదు టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఈ నిరీక్షణకు తెరపడుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఊహించని రీతిలో అటు భారత జట్టుకు తొలి మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురయింది.

 భారత జట్టు బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేయడంతో 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది టీమిండియా. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి విమర్శల మధ్య రెండో టెస్ట్ ప్రారంభించిన భారత జట్టు అద్భుతంగా రాణించింది. ఏకంగా సఫారీ జట్టుకు వారి సొంత గడ్డం మీదే ముచ్చెమటలు పట్టించింది అని చెప్పాలి. కేఫ్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకొని మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది టీం ఇండియా.

 అయితే సౌత్ ఆఫ్రికా పై రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. కేఫ్ టౌన్ లో ఆసియా నుంచి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా అవతరించింది అని చెప్పాలి. ఇదే పర్యటనలో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ సమం కాగా.. వన్డే సిరీస్ ను భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఈ పర్యటనలు ఆతిథ్య  సౌతాఫ్రికా పై భారతదేశ పై చేయి అన్నట్లుగా కొనసాగింది అని చెప్పాలి. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి చరిత్ర సృష్టించినప్పటికీ ఇక టెస్టు సిరీస్ గెలుచుకుని ఉంటే మరింత బాగుండేది అని అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: