టెస్ట్ క్రికెట్ అంటే మాకు గౌరవమే.. వివరణ ఇచ్చిన దక్షిణాఫ్రికా?

praveen
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రస్తుత క్రికెటర్లతో పాటు ఎంతోమంది మాజీలు కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతలా సఫారీ జట్టు క్రికెట్ బోర్డు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం కూడా లేకపోలేదు. న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవల ఒక జట్టును ప్రకటించింది. అయితే ఇక ఇలా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించినజట్టు విషయంపై విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.

 అదేంటి ఇక ప్రతి క్రికెట్ బోర్డు కూడా ఇలా టెస్ట్ సిరీస్ కోసం జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక దాంట్లో విమర్శలు ఎదుర్కోవడానికి ఏముంది అంటారా.. అయితే న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో టెస్ట్ సిరీస్ కి ఏకంగా ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు. ఏకంగా జట్టులో ఏడుగురు ప్లేయర్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ భవితవ్యం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతున్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇదే విషయంపై స్వయంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందిస్తూ జట్టు ఎంపిక విషయంలో వివరణ ఇచ్చింది. ఎస్ ఏ 20 లీగ్ కోసం స్టార్ ప్లేయర్లు అవసరం ఉండడంతో.. న్యూజిలాండ్తో టెస్టులకు కొత్త ఆటగాళ్ళను పంపుతుంది దక్షిణాఫ్రికా. అయితే ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. ఈ విషయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. మాకు టెస్ట్ క్రికెట్ అంటే అత్యంత గౌరవం.. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ను మరో టైంలో నిర్వహించాలని చూశాము. కానీ కుదరలేదు. దీంతో ఇలా చేయాల్సి వచ్చింది అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: