బిగ్ బాష్ లీగ్ లో దుమ్ము రేపుతున్న.. యువరాజ్ శిష్యుడు?

praveen
బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక ఇలాంటి టి20 లీగ్లను నిర్వహిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ప్రతి ఏడాది బిగ్ బాష్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ బిగ్ బాష్ లీగ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు పాల్గొని సత్తా చాటుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇక ఈ టోర్నీలో భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ శిష్యుడు నిఖిల్ చౌదరి పాల్గొని అదరగొడుతున్నాడు. హోబర్ట్ హారికెన్స్  తరపున ఆడుతున్న ఈ భారత ఆల్రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 పంజాబ్ కు చెందిన 22 ఏళ్ల నిఖిల్ చౌదరి అద్భుతమైన ప్రదర్శనలతో ఇక బిగ్ బాష్ లీగ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల సిడ్నీ తండర్స్ తో జరిగిన మ్యాచ్లో తొలి వికెట్ పడగొట్టిన నిఖిల్ చౌదరి.. బ్యాటింగ్లో శిఖర్ ధావన్ సిగ్నేచర్ స్టైల్ ను రీ క్రియేట్ చేశాడు. ఏకంగా 16 బంతుల్లో  32 పరుగులు చేసి అదరగొట్టాడు. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో రాష్ట్ర జట్టులో భాగమయ్యాడు. అదే సమయంలో భారత మాజీ అలవలన యువరాజ్ సింగ్ నుండి ఇన్నింగ్స్ లు ఎలా నిర్మించాలి. పెద్ద లక్ష్యాలను ఎలా అధికమించాలి లాంటి పలు మెలుకువలు నేర్చుకున్నాడు. అయితే ఆఫ్ స్పిన్నర్ అవ్వడానికి ముందు బ్రెట్ లీ మాదిరి ఫేస్ బౌలర్ అవ్వాలి అనుకున్నాడు ఈ యువ క్రికెటర్.

 అయితే కుటుంబ సభ్యులతో కలిసి సెలవుల్లో ఆస్ట్రేలియా వెళ్లిన నిఖిల్ చౌదరికి ఇక ఈ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. అతడు స్థానికంగా ఆస్ట్రేలియా కోస్టులో కొరియర్ బాయ్ గా పనిచేస్తూ నార్తర్న్ సబర్స్ క్లబ్ కు ఆడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతని ప్రతిభను గుర్తించిన మాజీ ఆస్ట్రేలియాను క్రికెటర్ జేమ్స్ హోప్స్ అతని హోబర్ట్ హారికెన్స్ జట్టుకు సిఫారసు చేశాడు. అలా నిఖిల్ చౌదరి బిగ్ బాస్ లీగ్ లో కాంట్రాక్టు పొంది.. ఇక ఇప్పుడు తన ప్రదర్శనతో అదరగొడుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: