ఫైనల్ లో ఓటమి తర్వాత కోహ్లీ రియాక్షన్.. బయటకొచ్చిన వీడియో?

praveen
2011 లో ధోని కెప్టెన్సీ లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి  టీం గా కొనసాగుతున్న భారత జట్టు ఇక ప్రతి వరల్డ్ కప్పులో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ సెమి ఫైనల్ లేదా ఫైనల్ వరకు దూసుకుపోయి ఇక కీలకమైన మ్యాచ్లలో తడబడి చివరికి వరల్డ్ కప్ ను చేర్చుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  అయితే గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది.

 వరల్డ్ కప్ గెలవాలనే నిరీక్షణకు రోహిత్ కెప్టెన్సీలో తెరపడుతుంది అని భారత క్రికెట్ పరీక్షకులందరూ కూడా బలమైన నమ్మకం పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే భారత జట్టు సొంత గడ్డపై జరిగిన టోర్నీలో మొత్తంగా వరుసగా పది మ్యాచ్లలో విజయం సాధించి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న ప్రతి జట్టును కూడా ఓడించింది. కానీ ఇక ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియాతో పోటీ పడలేక వెనకబడిపోయింది.  ఆస్ట్రేలియా ఫైనల్లో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది అని చెప్పాలి. ఇక ఈ ఓటమితో భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మళ్లీ నిరాశలో మునిగిపోయారు.

 అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి బాధ నుంచి ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇంకా బయటపడలేకపోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇక వరల్డ్ కప్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ రియాక్షన్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా కోహ్లీ ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయాడు. ఏకంగా తన క్యాప్ తో స్టంప్స్ ని పడగొట్టాడు. లోపల నుంచి ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ ఎంతో బాధతో కనిపించాడు విరాట్ కోహ్లీ. ఈ వీడియో చూసి కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ బాధ పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: