నాథన్ లియోన్ నా రికార్డు బ్రేక్ చేస్తే.. సంతోషిస్తా : ఆసీస్ మాజీ

praveen
క్రికెట్లో వన్డే టి20 ఫార్మాట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్ అనే మూడు ఫార్మట్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు ఇష్టపడేది మాత్రం టెస్ట్ ఫార్మాట్ ని అని చెప్పాలి. ఎందుకంటే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే ఈ ఫార్మాట్లో ఇక అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న ప్రతి స్టార్ ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో రికార్డులు కొల్లగొడితే ఇక దానిని ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే సుదీర్ఘమైన ఈ ఫార్మాట్లో ఎక్కువ కాలం పాటు కెరియర్ను కొనసాగించడం అంత సులభమైన విషయమేమీ కాదు.

 ఏకంగా ఆటగాళ్ళ ఫిట్నెస్ కి ప్రతిభకు ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లని విసురుతూ ఉంటుంది టెస్ట్ ఫార్మాట్. ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొని ఇక ముందుకు సాగడం అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పాలి. అందుకే కొంతమందికి ఆటగాళ్లు మాత్రమే టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు. అందుకే టెస్ట్ ఫార్మట్ లో ఎవరైనా ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసి అరుదైన రికార్డులు సాధించాడు అంటే చాలు ఇక తనపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. కాగా ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్.

 పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా ఈ ఘనతను సాధించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై ఇక అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కాగా నాథన్ లియోన్ పై ఆ దేశ లెజెండరీ బౌలర్ మెక్ గ్రాత్ కూడా ప్రశంసలు కురిపించాడు. లియాన్ బౌలింగ్ స్కిల్స్ అద్భుతం. అతనొక అసాధారణ బౌలర్. పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తాడు. ఇక భవిష్యత్తులో నా రికార్డును కూడా బ్రేక్ చేస్తాడని ఆశిస్తున్నా.. ఇక షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేస్తే అతనికి తిరుగు ఉండదు అంటూ మెక్ గ్రాత్ వ్యాఖ్యానించాడు. కాగా టెస్ట్ క్రికెట్లో మెక్ గ్రాత్ 563 వికెట్లు తీయగా ఇక షేన్ వార్ను 708 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: