ఆయన నుండి ప్రశంసలు.. జీవితం మొత్తం గుర్తుంటాయి : కేఎల్ రాహుల్

praveen
ఇటీవల సౌత్ ఆఫ్రికా, ఇండియా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఎంత దారుణంగా విఫలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి. ఇక భారత జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. సఫారీ గడ్డపై అందరూ కూడా తేలిపోయారు. ఈ క్రమంలోనే పటిష్టమైన భారత జట్టు కనీసం పసి కూనలాగా కూడా ప్రదర్శన చేయలేక పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు ప్రదర్శన పై అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఇలాంటి ఆట తీరుతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడం చాలా కష్టం అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు  కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టులోని స్టార్ ప్లేయర్లు అందరూ కూడా విఫలమైన సమయంలో అటు కేఎల్ రాహుల్ మాత్రం తన ఇన్నింగ్స్ తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఏకంగా మిగతా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి తెగ కష్టపడి పోతున్న అదే పిచ్ పై ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగలిగాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే  రాహుల్ సెంచరీపై ఇక మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంశాల వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే సెంచరీపై స్పందించిన సునీల్ గవాస్కర్  అతని సెంచరీ టెస్ట్ క్రికెట్ చరిత్రలొ టాప్ టెన్ జాబితాలో నిలిచిపోతుంది అంటూ ప్రశంసించాడు. అయితే ఈ ప్రశంసలపై కేఎల్ రాహుల్ స్పందించాడు. గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ నుంచి ఇలాంటి ప్రశంసలు  ఇక జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు  పరిస్థితిని బట్టి ఆట మార్చుకుంటూ ముందుకు వెళ్లా. కానీ మ్యాచ్లో ఓడిపోవడం బాధ కలిగించింది అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: