రెండో టెస్ట్ కు ఈ మార్పులు చేయండి.. సునీల్ గవాస్కర్ సూచన?
అయితే కనీసం ఈసారైనా రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు అటు టెస్ట్ సిరీస్ ను సఫారీ గడ్డపై గెలుస్తుంది అనుకుంటే అది మరోసారి కలగానే మిగిలిపోయింది. ఇక మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో ఆదిఖ్యాన్ని సంపాదించింది. ఇక జనవరి మూడవ తేదీ నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కి ముందు అటు భారత జట్టులో పలు మార్పులు చేర్పులు చేయాలి అంటూ కీలక సూచన చేశాడు భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.
రవీంద్ర జడేజా పూర్తిగా ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తాడు అని ఆశిస్తున్నాను. ఇక ప్రసిద్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ ను జట్టులోకి తీసుకోవాలి. కేఫ్ టౌన్ లో గాలి కూడా స్వింగ్ కి సహకరిస్తుంది. అందుకే స్వింగ్ బౌలింగ్ చేసే వారికి సక్సెస్ దక్కుతుంది. ముఖేష్ కుమార్ లాంటి బౌలర్ స్వింగ్ రాబట్ట గలడు అంటూ సునీల్ గవాస్కర్ సూచన చేశాడు. ఇదిలా ఉంటే కేప్ టౌన్ పిచ్ స్పిన్ కి పెద్దగా సహకరించే అవకాశం లేదు. అందుకే జట్టులో స్పిన్నర్ గా అశ్విన్ కంటే జడేజాకే జట్టు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో తుది జట్టులో అశ్విన్కు చోటు కష్టమే. ఒకవేళ శార్దూల్ ను తప్పిస్తేనే అశ్విన్ కు ప్లేస్ ఉంటుంది అని చెప్పాలి.