కాస్త కష్టమైనా.. ఫ్యాన్స్ కోసం ఇదంతా చేస్తున్నా : ధోని

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి వరల్డ్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు వరల్డ్ క్రికెట్లోనే బెస్ట్ కెప్టెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండు సార్లు అందించి ఏకంగా లెజెండ్ గా తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు ధోని.


 అయితే మహేంద్రసింగ్ ధోని అటు వరల్డ్ క్రికెట్లో ఎంత గుర్తింపును సంపాదించుకున్న తన ఆటిట్యూడ్ ను మాత్రం మార్చుకోలేదు. ఎప్పుడు మైదానంలో ప్రశాంతంగా ఉంటూ తన హావ భావాలను లోపలే దాచుకుంటూ చిరునవ్వుతోనే కనిపించేవాడు. ఇక ఇలాంటి యాటిట్యూడ్ ధోనిని అందరు క్రికెటర్లలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోని ఆటకు ఎంత అయితే క్రేజీ ఉందో అటు ధోని హెయిర్ స్టైల్ కూడా అంతే క్రేజ్ ఉంది అని చెప్పాలి.


 ధోని ఎప్పుడు కొత్తగా హెయిర్ స్టైల్ ప్రయత్నించిన కూడా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇలా లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం వెనుక అసలు కారణం చెప్పుకొచ్చాడు. ఇలాంటి హెయిర్ స్టైల్  మైంటైన్ చేయడం చాలా కష్టం. ఇంతకుముందు నేను 20 నిమిషాల్లో రెడీ అయ్యే వాడిని. కానీ ఇప్పుడు ఏకంగా ఒక గంట పది నిమిషాల సమయం పడుతుంది. ఈ హెయిర్ స్టైల్ లో అభిమానులు ఇష్టపడుతున్నారు. అందుకే కాస్త కష్టమైన ఇదే హెయిర్ స్టైల్ కొనసాగిస్తున్న. ఏదో ఒక రోజు ఇక చాలు అన్నప్పుడు తప్పకుండా హెయిర్ కట్ చేస్తా అంటూ ధోని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: