ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. నా భార్యను కించపరిచారు : దక్షిణాఫ్రికా స్పిన్నర్

praveen
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో రకాల ఆటలు ఆడే ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎంతో మంది క్రీడాభిమానులు మాత్రం అటు క్రికెట్ ని కాస్త అమితంగా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా క్రికెట్ ప్లేయర్లను దైవంగా ఆరాధించే అభిమానులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక తమ అభిమాన క్రికెటర్ను ఒక్కసారి కలిసిన చాలు అని ఎంతో ఆశపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి అభిమానం బాగానే ఉంటుంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఏకంగా కొన్ని కొన్ని సార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పాలి. తమ అభిమాన ప్లేయర్ ను అవుట్ చేసిన ప్రత్యర్థి బౌలర్లను లేదంటే మంచి ఇన్నింగ్స్ తో భారత్ను ఓడించిన ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు.


 విమర్శలు అంటే అలాంటి ఇలాంటి విమర్శలు కాదు  ఏకంగా పర్సనల్ విషయాలను కూడా తెరమీదకి తీసుకువస్తూ దారుణంగా ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అభిమానం పరిమితి వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక ఇలా అభిమానులు అత్యుత్సాహంతో ఏకంగా ప్రత్యర్థి ప్లేయర్లకు కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే తనకు భారత క్రికెట్ అభిమానుల నుంచి ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది అంటూ చెబుతున్నాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రీజ్ షంశి.


 ఏకంగా తన భార్యను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అంటూ ఇటీవల చేదు అనుభవాని చెప్పుకొచ్చాడు. ఏకంగా తన భార్యను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. డిసెంబర్ 12న జరిగిన రెండవ టి20 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో బెదిరింపు పోస్టులు పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మ్యాచ్ లో వికెట్ తీసిన షంశి వినూత్నమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఈ సెలబ్రేషన్స్ నచ్చకే భారత క్రికెట్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: