వేలంలో ఎవరు కొనకపోతే.. ధోని సీఎస్కేలోకి తీసుకుంటానన్నాడు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ఇటీవల జరిగింది అన్న విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో ఎంతో మంది స్టాక్ ప్లేయర్లు అందరూ ఊహించినట్లుగానే భారీ ధర పలికారు  అయితే కేవలం స్టార్ ప్లేయర్లు మాత్రమే కాదండోయ్ అటు యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటారు అని చెప్పాలి. అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ.. ఇక దేశవాళీ క్రికెట్లో ఆయా యువ ఆటగాళ్ళ ప్రదర్శన ఆధారంగా ఎంతోమంది కుర్రాళ్లకు కోట్ల రూపాయల దర దక్కింది అని చెప్పాలి.


 ఏకంగా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీలు ఇలా ప్రతిభ గల యంగ్ ప్లేయర్స్ ని జట్టులోకి తీసుకున్నాయి. అయితే ఇలా ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్ళలో అటు రాబిన్ మింజ్ కూడా ఒకరు అని చెప్పాలి. గిరిజన తెగకు చెందిన ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ ను ఏకంగా చాంపియన్ టీమ్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా ఇతని కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి 3.6 కోట్లకి గుజరాత్ తమ జట్టులో చేర్చుకుంది అని చెప్పాలి. ఇక ఈ కుర్రాడికి భారీ ధర పలకడంతోఅతని కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది.


 గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ గురించి అతని తండ్రి ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాబిన్ తండ్రి జేవియర్ మింజ్ ఒకవేళ తన కొడుకు వేలంలో అమ్ముడుపోకపోతే మహేంద్రసింగ్ ధోని తన టీం లోకి తీసుకుంటాను అనే మాట ఇచ్చారు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు  మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే నాతో మాట్లాడారు. వేలంలో తన కొడుకుని ఏ టీం తీసుకోకపోతే ఇక  చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేస్తుంది అని మాట ఇచ్చాడు. తాను రాంచి విమానాశ్రయంలో పనిచేస్తున్నానని ఇక అక్కడే మహేంద్ర సింగ్ ధోనినీ కలిసాను అంటూ చెప్పుకొచ్చారు జేవియర్ మింజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: