అల్లరి నరేష్ ప్రేమించిన హీరోయిన్ ని.. స్టార్ హీరో పెళ్లి చేసుకున్నాడా?
దీంతో ఇక ఇటీవల కాలం లో కేవలం కామెడీ ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనలోని నటుడిని కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉన్నాడు నరేష్. ఇక అంతే కాదు ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలకపాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే సినిమాల్లో ఎంతో అల్లరిగా కనిపించే నరేష్.. బయట మాత్రం తక్కువగా మాట్లాడుతాడు. కాంట్రవర్షియల్ విషయాల్లో అస్సలు తల దూర్చాడు. అయితే నరేష్ ఒకానొక సమయంలో ఒక హీరోయిన్ని గాఢంగా ప్రేమించాడట.
నరేష్ ఎంతో ఈజీగా మనుషులను నమ్మేస్తాడట. ఇక హీరోయిన్ ను ఇలాగే ప్రేమించి గుడ్డిగా నమ్మాడట. కానీ ఆ హీరోయిన్ ఏకంగా అల్లరి నరేష్ ని మోసం చేసిందట. ఇలా అల్లరి నరేష్ ఎంతో గాఢంగా ప్రేమించిన హీరోయిన్ మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకుందట. అయితే ఆ హీరోయిన్ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో భార్య అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న నా సామరంగ సినిమాలో కీలకపాత్రలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.