రాసి పెట్టుకోండి.. అతనే ఫ్యూచర్ స్టార్ : అశ్విన్

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో చోటు సంపాదించుకున్న ఎంతోమంది యువ ఆటగాళ్ళు  ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక వచ్చిన ఛాన్స్ ని బాగా సద్వినియోగం చేసుకుంటూ తమ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటున్నారు ప్లేయర్లు. ప్రస్తుతం భారత జట్టు అటు సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడుతుంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ ఫస్ట్ మ్యాచ్ తో అటు యువ ఆటగాడు సాయి సుదర్శన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.


 ఇక మొదటి మ్యాచ్ లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు . 49 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ తో చెలరేగిపోయాడు సాయి సుదర్శన్. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఈ యువ ఆటగాడు ప్రదర్శన చూసి ప్రస్తుతం అటు సీనియర్లందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే విషయం గురించి స్పందించిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి వన్డే మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ రూపంలో భారత్కు భవిష్యత్తు స్టార్ దొరికాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమ్ ఇండియాకు అతడే నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు అశ్విన్.


 నమ్మకం కుదరకపోతే నా వ్యాఖ్యలను రాసి పెట్టుకోండి అంటూ ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడని.. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్న రాసి పెట్టుకోండి. ఈ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. 2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అతను వెనుతిరిగి చూసుకోలేదు. అన్ని దేశవాళి టోర్నీలోనూ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు వన్డే  మ్యాచ్ లోను తానేంటో నిరూపించుకున్నారు. అతనే భవిష్యత్తు సూపర్ స్టార్ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. కాగా అశ్విన్ కూడా తమిళనాడుకు చెందిన వాడు గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: