ప్రైస్ మనీ సరే.. ఇంతకీ పల్లవి ప్రశాంత్ పారితోషకం ఎంతో తెలుసా?
ఎంతలా అంటే.. హౌస్ లో ప్రశాంత్ కాకుండా ఒకప్పుడు సినిమాల్లో స్టార్లుగా హవా నడిపించిన వారు.. సీరియల్స్ లో ప్రేక్షకులను అలరించిన సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కామన్ మ్యాన్ వెంటే మేము ఉంటాం అంటూ ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. దీంతో ఇక సెలబ్రిటీలతో పోల్చి చూస్తే ఓటింగ్స్ లో ఎవరికి అందనంత దూరంలోకి వెళ్లిపోయాడు ప్రశాంత్. అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ విజేతగా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 35 లక్షల ప్రైజ్ మనీ, 15 లక్షల విలువైన కార్, 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కూడా బహుమతిగా పొందాడు.
ప్రైజ్ మనీ సరే కానీ ఇక హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన పల్లవి ప్రశాంత్ వారానికి ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో పల్లవి ప్రశాంత్ కు తక్కువగానే పారితోషకం ఇచ్చారట. రోజుకు 15000 మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన అతను హౌస్ లో 15 వారాలు ఉన్నందుకుగాను.. 15 లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు వెనుకేసుకున్నాడట. అయితే అతను తీసుకున్న పారితోషకంలో టాక్స్ కటింగ్స్ పోను పల్లవి ప్రశాంత్ కు పారితోషకం మరింత తక్కువే దక్కింది అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.