రోహిత్ శర్మకు.. మరో బిగ్ షాక్ తప్పదా?
కాగా ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉండగా అటు రోహిత్ శర్మ మాత్రం ఎక్కడ ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోగొట్టుకున్న రోహిత్ శర్మకు.. మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది అన్న వార్త కూడా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఏకంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20 కెప్టెన్సీ కూడా కోల్పోయేలాగే కనిపిస్తూ ఉంది. గత కొంతకాలం నుంచి రోహిత్ టి20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాత్కాలిక కెప్టెన్ అని చెబుతున్నప్పటికీ హార్థిక్ పాండ్యానే టి20 లకు పూర్తిస్థాయి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి.
ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నప్పటికీ.. ఇక హార్దిక్ పాండ్యానే టి20 కెప్టెన్ గా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీంతో రోహిత్ అంతర్జాతీయ టి20 కెప్టెన్సీ కూడా కోల్పోయేలా కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్య తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు. ఇక వచ్చే ఏడాదికి టి20 వరల్డ్ కప్ హార్థిక్ పాండ్యాని కెప్టెన్ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందట బీసీసీఐ. 2022 t20 వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు రోహిత్. దీంతో ఇకపై ఆడే అవకాశాలు కూడా లేవని.. అతని టి20 కెప్టెన్సీ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.