ధోనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?
అయితే క్రికెట్ అంటే ప్రాణంగా బ్రతికిన మహేంద్ర సింగ్ ధోనిపై గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడటంతో చివరికి రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై అప్పట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. అయితే సంపత్ కుమార్ కూడా బుకీల నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో అతన్ని విచారణ నుంచి తప్పించారు. కానీ ఆ తర్వాత కోర్టు విచారణలో అతను నిర్దోషిగా తేలాడు. అయితే తనపై ఐపీఎస్ అధికారి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మహేంద్రసింగ్ ధోని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఏకంగా టీవీ ఛానల్, ఐపీఎస్ అధికారి పై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశాడు ధోని. అంతేకాదు తన 17 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు వివరణ ఇవ్వాలని టీవీ ఛానల్, సంపత్ కుమార్ ని కూడా ఆదేశించింది. ఇక టీవీ ఛానల్ ఇచ్చిన క్లారిటీపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధోని లాంటి ప్రముఖ క్రికెటర్ కు సంబంధించి ఏదైనా వార్తలు చూపించే ముందు ముందుగా ధ్రువీకరించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇక సంపత్ కుమార్ ఇచ్చిన వివరణ కూడా ధోని కోపాన్ని తగ్గించుకోలేకపోయింది. కాగా ఇటీవల ధోని పిటిషన్ విచారించిన హైకోర్టు ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్ కు 15 రోజులు జైలు శిక్ష విధించింది.