రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా.. తప్పించారా?

praveen
రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా కు మూడు ఫార్మట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు  ఇక అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది భారత జట్టు. అయితే రోహిత్ శర్మకు ఇలా కెప్టెన్సీ దక్కడానికి కారణం ఏంటి అంటే బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  ఐపిఎల్ టోర్ని అని చెప్పాలి.



 ఎందుకంటే అప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఒక సాదాసీదా జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ని తాను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపాడు రోహిత్ శర్మ. ఇక ఐదు సార్లు కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు. అంతేకాదు ఇక ప్రతి సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ఎంతో అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. దీంతో ఇక ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనికి అటు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది బీసీసీఐ.


 అయితే ఇటీవలే రోహిత్ శర్మ విషయంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఏకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ఇక కెప్టెన్గా తొలగిస్తూ ఆ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఏకంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్  ను కొత్త కెప్టెన్ గా నియమించింది మేనేజ్మెంట్. అయితే రోహిత్ శర్మ స్వయంగా కెప్టెన్సీ వదిలేసారా లేదంటే మేనేజ్మెంట్ తప్పించిందా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం ఆయన జట్టులో ఒక సాధారణ ప్లేయర్గా కొనసాగనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: