ఫైనల్లో ఓటమి తర్వాత.. ఆ మాటలు విన్నాకే ధైర్యం వచ్చింది : షమి

praveen
వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతుంది భారత్. అలాంటి భారత జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది గత కొంతకాలం నుంచి కలగానే మిగిలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతిసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరి అడుగులో తడబడి నిరాశపరచడం చేస్తూ వస్తుంది టీమ్ ఇండియా. గతంలో 2011లో ధోని కెప్టెన్సీలో గెలిచిన వరల్డ్ కప్ ఇక టీమిండియా కు చివరి వరల్డ్ కప్ కావడం గమనార్హం. ఆ తర్వాత పలుమార్లు సెమీఫైనల్ ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఇండియా వేడుకగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం తప్పకుండా టీమిండియా టైటిల్ గెలుస్తుందని అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


 అంచనాలకు తగ్గట్లుగానే టీమిండియా ప్రస్థానం కూడా కొనసాగింది అన్న విషయం తెలిసిందె. ప్రతి మ్యాచ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకొచ్చింది. అయితే ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాతో తలబడి నిలబడి కప్పు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో టీమ్ ఇండియా తడబడింది. దీంతో ఫైనల్ పోరులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది.  అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినా తర్వాత భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇక ఈ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇంకా ఈ ఓటమి గురించి చర్చ జరుగుతూనే ఉంది.



 అయితే మునుపెన్నడూ లేని విధంగా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఏకంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు  ఇక ఈ విషయంపై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు. ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన మహమ్మద్ షమి ఫైనల్ ఓటమి తర్వాత ప్రధాని మోదీ వచ్చి ఓదార్చడంతో తమలో ధైర్యం వచ్చిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్లు అందరం మౌనంగా ఉండి పోయాం. ఎవరు అన్నం కూడా తినలేదు. కానీ ఒక్కసారిగా మోడీ వచ్చి సర్ప్రైజ్ చేశారు. మా అందరితో మాట్లాడారు. ఆయన వెళ్లిన తర్వాత మేమందరం మాట్లాడుకున్నాం. ఆయన మాటలు చాలా ఉపయోగపడ్డాయి అంటూ షమీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: