అలాంటి గేమ్.. రోహిత్ ను ఎప్పటికీ చెత్త కెప్టెన్ చేయదు : గంభీర్

praveen
ప్రస్తుతం భారత జట్టులో మూడు ఫార్మాట్లకు కూడా సారధిగా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ని టైటిల్ విజేతగా నిలిపి తన కెప్టెన్సీ వ్యూహాలతో అందరిని ఫిదా చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అనే నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. తర్వాత అనహ్య పరిణామాల మధ్య రోహిత్ శర్మ చేతికి సారధ్య బాధ్యతలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా కెప్టెన్సీ అందుకున్న తర్వాత కూడా రోహిత్ శర్మ జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా భారత జట్టుని నెంబర్ వన్ స్థానంలో నిలపడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ ఇండియా ఆసియా కప్ విజేతగా కూడా నిలిచింది అని చెప్పాలి. అయితే గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తో పాటు ఈ ఏడాది జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు టీమిండియా పర్వాలేదు అనిపించినప్పటికీ.. టైటిల్ కల మాత్రం నెరవేరలేదు అని చెప్పాలి. అయినప్పటికీ ఇక వరల్డ్ కప్ టోర్నీలలో భారత కెప్టెన్ గా రోహిత్ నడిపించిన తీరు మాత్రం అందరిని ఫిదా చేసేసింది.


 ఇక రోహిత్ కెప్టెన్సీ నైపుణ్యం పై ఇటీవల స్పందించిన భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. వన్డే వరల్డ్ కప్ ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు గంభీర్. సారధిగా రోహిత్ జట్టును ఎంతో చక్కగా నడిపాడు. ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం, ఫైనల్ వరకు భారత జట్టును తీసుకువెళ్లడం.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం అంత సులభం కాదు. ఫైనల్లో గెలవకపోయినా భారత జట్టు ఛాంపియన్స్ లాగా ఆడింది. ఒక్క బ్యాడ్ గేమ్ రోహిత్ ను చెత్త కెప్టెన్ గా మార్చదు. రోహిత్ ను గానీ జట్టును కానీ నిందించాల్సిన అవసరం లేదు అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: