కోహ్లీతో.. జాగ్రత్తగా ఉండాలి : ఏబిడి

praveen
మొన్నటి వరకు వరల్డ్ కప్ లో భాగంగా వరుస మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్న టీమ్ ఇండియా ఇక ప్రస్తుతం వరుస ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ అయ్యింది అన్న విషయం తెలిసిందే  వరల్డ్ కప్ ముగిసిన రోజుల వ్యవధిలోనే అటు ఆస్ట్రేలియా జట్టుతో టి20 సిరీస్ ఆడటం మొదలుపెట్టింది భారత జట్టు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా అటు భారత జట్టు టి20 సిరీస్ ప్రారంభించగా ఇక మొదటి అడుగులోనే సూపర్ విజయాన్ని సాధించింది. 4-1 తేడాతో విజయం సాధించింది. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది టీం ఇండియా జట్టు.

 ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సౌత్ ఆఫ్రికాలో మూడు ఫార్మట్లలో ఆడబోయే టీమ్స్ కు సంబంధించిన వివరాలను అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఏకంగా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను ప్రకటించింది బిసిసిఐ. టి20 ఫార్మాట్కు సూర్యకుమార్ యాదవ్ సారధ్య బాధ్యతలు చేపట్టనుండగా వన్డే ఫార్మాట్కు కేఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్ కు రోహిత్ శర్మలు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు.  అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నది విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఇదే విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు విరాట్ కోహ్లీ స్నేహితుడు ఏబి డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా తో టీమిండియా ఆడే టెస్ట్ మ్యాచ్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొడతాడు అంటూ ఎ బి డివిలియర్స్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చూస్తాం. మాటలతో దూకుడు ప్రదర్శిస్తాడు. ఇక ఈ సిరీస్లో అతను బాగా చెలరేగే అవకాశం ఉంది. అందుకే దక్షిణాఫ్రికా టీం జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు ఎబి డివిలియర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: