ఆ ఇద్దరు ప్లేయర్లకు.. నెలరోజుల రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు?

praveen
దాదాపు నెలన్నర పాటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో అలరించిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో  ఈ వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రస్థానాన్ని  కొనసాగించిన టీమిండియా ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో కాస్త తడబాటుకు గురైంది. ఇక టీమిండియాని ఓడించిన ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ కాబోతుంది అని చెప్పాలి.

సొంత గడ్డం మీదే నేడు అటు ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇక జట్టులో యంగ్ ప్లేయర్స్ కి అవకాశం కల్పించారు సెలెక్టర్లు. ఇక మొన్నటి వరకు వరల్డ్ కప్ లో వరుసగా మ్యాచ్లు ఆడిన సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సైతం ఇలా విశ్రాంతి ప్రకటించారు. అయితే ఎన్ని రోజులపాటు ఈ సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం దాదాపు నెలరోజుల పాటు ఇద్దరు క్రికెటర్లు విశ్రాంతి తీసుకోబోతున్నారట.

 వన్డే వరల్డ్ కప్ తర్వాత తమకు నెలరోజుల పాటు రెస్ట్ కావాలని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సెలెక్టర్లను కోరారు అంటూ క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. దీంతో ఇక డిసెంబర్ 17 నుంచి 21మధ్య సౌత్ ఆఫ్రికా తో జరిగే మూడు మ్యాచ్లు, వన్డే సిరీస్ కు కూడా అటు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తుంది. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడట. ఇక డిసెంబర్ 26వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా తో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు రోహిత్ కోహ్లీ ఇద్దరు అందుబాటులోకి వస్తారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: