కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేది.. అప్పుడేనట తెలుసా?

praveen
భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ వున్నాడు విరాట్ కోహ్లీ. తన అద్భుతమైన ఆటతీరుతో ఎప్పుడు ఇక టీమ్ ఇండియాను విజయతీరాలకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో కూడా తన ఫామ్ తో హవా నడిపిస్తూ ఉంటాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక తన ఇన్నింగ్స్ లతో ఎన్నో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఉంటాడు   అందుకే విరాట్ కోహ్లీని రికార్డ్ ల రారాజు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ప్రేక్షకులు.


అయితే ప్రస్తుతం రికార్డుల విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇంకా కొత్త రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతూనే ఉన్నాడు. ఇక ఇటీవల  భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా సూపర్ ఫాం కనబరిచి.. ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా  ఓడిపోవడంతో అభిమానులు అందరూ నిరాశలో  మునిగిపోయారు. ఎందుకంటే కోహ్లీకి ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ అని అనుకుంటున్న నేపథ్యంలో  ఒక టైటిల్ గెలిచి ఉంటే బాగుండేదని అందరూ కోరుకున్నారు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఎప్పుడు రిటర్మెంట్ ప్రకటిస్తాడు అని అభిమానుల్లో కూడా చర్చ మొదలైంది. కాగా కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 2016లో స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ పేరుతో ఒక పోస్ట్ ను షేర్ చేయగా.. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 2016, 2017 లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తాడు. 2017, 2018 లో వివాహం జరుగుతుంది. 2020 లేదా 2021 మధ్యలో ఫామ్ కోల్పోతాడు. ఇక 2021 - 25 మధ్యలో కోహ్లీ కెరియర్ టాప్ లో ఉంటుంది. 2027 లో గొప్ప విజయం అందుకొని విరాట్ కోహ్లీ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ఆ పోస్టులో సారాంశం ఉంది. అయితే గతంలో ఆ పోస్టులో చెప్పినట్టుగానే కోహ్లీ లైఫ్ లో జరిగింది. దీంతో రిటైర్మెంట్ కూడా అందులో చెప్పినట్లు జరుగుతున్న ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: