వరల్డ్ కప్ 2013.. అరుదైన రికార్డ్?
ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా వారి ఖాతాలో వేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా జట్టును గెలిపించేందుకు హోరాహోరీగా పోరాటం సాగించారు అని చెప్పాలి.
ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ లో కూడా సెంచరీల హోరు కొనసాగింది. ఇక భారీగా పరుగుల వరద పారింది అని చెప్పాలి. అయితే ఇలా కేవలం వరల్డ్ కప్ లో ఆయా జట్ల తరఫున ఆడుతున్న ఆటగాళ్లు మాత్రమే కాదు ఏకంగా వరల్డ్ కప్ టోర్నీ కూడా అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా అత్యధిక సిక్సర్లు నమోదైన వరల్డ్ కప్ ఎడిషన్ గా 2023 వన్డే వరల్డ్ కప్ నిలిచింది అని చెప్పాలి. ఇక మరోవైపు ఈ వరల్డ్ కప్ అటు ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రికార్డును దక్కించుకుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇక వరల్డ్ కప్ టోర్నీ మరో అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఏకంగా 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీని అత్యధికంగా 12,50,037 మంది ప్రేక్షకులు స్టేడియంలో వీక్షించారు. అయితే చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ను అటు పది లక్షల పదహారువేల 420 మంది ప్రేక్షకులు వీక్షించగా.. ఇటీవల ఈ రికార్డు బద్దలైంది అని చెప్పాలి. ఏకంగా ఈ వరల్డ్ కప్ లో భాగంగా 45 లీగ్ మ్యాచ్ లు, రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు, ఒక ఫైనల్ మ్యాచ్ జరిగాయి అని చెప్పాలి. ఇక ఫైనల్ మ్యాచ్ 92,453 మంది ప్రేక్షకులు స్టేడియంలో వీక్షించారు. భారత్లో ఉన్న పది వేదికలలో కూడా ఈ వరల్డ్ కప్ టోర్నీ లోని మ్యాచ్లు జరిగాయి అన్న విషయం తెలిసిందే.