కోహ్లీ రికార్డ్.. అయినా ఏం లాభం అంటున్న ఫ్యాన్స్?
ఈ క్రమంలోనే భారత బ్యాట్స్మెన్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఇక టీమిండియా జట్టు విజయం కోసం ఎంతలా బౌలర్లు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అటు విరాట్ కోహ్లీ ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఏకంగా మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ పోరు ముగిసే సరికి 765 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు
ఒక ప్రపంచ కప్ ఎడిషన్ లో ఏకంగా 765 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్న.. మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో టీమిండియా ఓటమిపాలు అయింది. అయితే ఇక మరోవైపు టి20 వరల్డ్ 2014లో 319 పరుగులు, ఐపీఎల్ 2016లో 973 పరుగులతో ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అయితే కోహ్లీ ఎలాంటి రికార్డు సాధిస్తే ఏంటి.. టీమ్ ఇండియా కప్పు గెలవకుండా ఫైనల్లో ఓడిపోయినప్పుడు అని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ రికార్డు పై కామెంట్ చేస్తున్నారు.