వాళ్ళు చెత్త కోచ్ లు.. ఫుల్ షాట్స్ కి ఔటైతే పక్కన పెట్టేవారు : గంభీర్

praveen
ధోని కెప్టెన్సీలో టీమిండియా రెండు వరల్డ్ కప్ లు గెలిచింది. అయితే ఈ రెండు వరల్డ్ కప్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర వహించింది ఒకప్పటి స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్. కేవలం రెండు వరల్డ్ కప్లలో మాత్రమే కాదు భారత జట్టు తరఫున ఎనో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఆడి ఇక భారత లెజెండ్స్ లో అతను కూడా ఒకడిగా చేరిపోయాడు అని చెప్పాలి. అయితే గౌతమ్ గంభిర్  ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. అందుకే అతను ఎప్పుడు ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే తన కెరియర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గంభీర్   ప్రస్తుతం ప్రపంచ కప్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు  ఇటీవల సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్కు కామెంటెటర్ గా వ్యవహరించిన గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. తాను క్రికెట్ లో ఉన్న సమయంలో ఫుల్ షాట్స్, హుక్ షాట్స్ ఆడుతూ అవుట్ అయితే జట్టు నుంచి తప్పించేవారు అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.


 అప్పుడు కోచింగ్ ఎంతో భిన్నంగా ఉండేది. టెస్ట్ బుక్ షాట్స్ మాత్రమే ఆడాలని ప్లేయర్స్ పై ఒత్తిడి చేసేవారు అంటూ చెప్పుకొచ్చాడు. అదో చెత్త కోచింగ్ అంటూ మండిపడ్డాడు. పాకిస్తాన్ పర్యటనలో ఒక ఫుల్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యానని.. అర్ధాంతరంగా తనను జట్టు నుంచి తప్పించారు అంటూ తెలిపాడు. కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ షాట్స్ ఆడుతూ వికెట్ కోల్పోయిన ఏమనే వారు కాదు  కానీ ఫుల్ షాట్స్, హుక్ షాట్స్ ఆడబోయి వికెట్ కోల్పోతే మాత్రం తర్వాత మ్యాచ్లో జట్టు నుంచి తప్పించేవారు. పాకిస్తాన్ పర్యటనలో నన్ను ఇలాగే జట్టు నుంచి పక్కన పెడితే నేను టీం మేనేజ్మెంట్ ను నిలదీశాను. కవర్ డ్రైవ్ ఆడుతూ అవుట్ అయి ఉంటే పక్కన పెట్టేవారా అంటూ ప్రశ్నించా. అయితే క్రికెట్లో ఇలాంటి తరహా కోచింగ్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. కేవలం ఆటగాడు యొక్క బ్యాటింగ్ మెరుగుపరచడమే కోచ్ బాధ్యత. అంతేగాని బ్యాటర్ ను నియంత్రించడం కాదు అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: