వరల్డ్ కప్ లో.. ఏ టీమ్ ఎక్కువసార్లు ఫైనల్ కు వెళ్లిందో తెలుసా?
అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ పోరు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి తుది దశకు చేరుకున్న టీమ్స్ యొక్క గత గణాంకాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరిస్తున్నారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు అయితే మొదటి సెమి ఫైనల్లో గెలిచి టీమ్ ఇండియా రెండో సెమీఫైనల్ లో గెలిచి ఆస్ట్రేలియా ఫైనల్ లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ హిస్టరీలో ఎక్కువసార్లు ఫైనల్ వరకు చేరుకున్న టీమ్స్ ఏవి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఇప్పటికే వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచి ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ఆస్ట్రేలియానే ఎక్కువసార్లు ఫైనల్ చేరిన జట్టుగా టాప్ లో కొనసాగుతుంది..ఇప్పుడు వరకు ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 8సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఆ తర్వాత ఎక్కువసార్లు ఫైనల్ వరకు చేరుకున్న టీమ్స్ గా ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి ఈ రెండు టీమ్స్ చేరో నాలుగు సార్లు ఫైనల్ లో అడుగుపెట్టాయి అని చెప్పాలి. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక జట్లు చెరో మూడు సార్లు ఫైనల్లో అడుగుపెట్టగా.. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు చేరో రెండుసార్లు ఇలా వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లాయి.