వరల్డ్ కప్ - 2023లో.. టీమిండియా ప్లేయర్స్ ప్రదర్శన ఎలా ఉందంటే?
స్వదేశీ పిచ్ లపై తమకు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ వరల్డ్ కప్ టోర్నీలో చూపిస్తుంది భారత జట్టు. ఇక జట్టులోని ప్రతి ప్లేయర్ కూడా అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నారు. ఇక తమ కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇక తిరుగులేదు అని నిరూపిస్తున్నారు. ఇలా సమిష్టి కృషితో భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. లీగ్ దశతో పాటు సెమీఫైనల్ లో కూడా విజయం సాధించి.. అటు ఫైనల్ అడుగుపెట్టింది టీం ఇండియా. ఇక ప్రస్తుతం భారత జట్టు దూకుడు చూస్తుంటే.. ఫైనల్ లో కూడా ఆస్ట్రేలియాపై అలవోకగా విజయం సాధించడం ఖాయమని అందరూ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
ఇలాంటి సమయంలో ఇక ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో భారత జట్టులో ఏ ప్లేయర్ ఎలాంటి ప్రదర్శన చేశాడు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాలు చూసుకుంటే..
విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో 711 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ 550 రన్స్, శ్రేయస్ 526, కేఎల్ రాహుల్ 386, గిల్ 350 రన్స్ తో తర్వాత స్థానంలో ఉన్నారు.
ఇక బౌలర్లలో మహమ్మద్ షమీ 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్ టేకర్ గా ఈ వరల్డ్ కప్ లో టాప్ లో కొనసాగుతున్నాడు. కేవలం 6 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత బుమ్రా 18, జడేజా 16, కుల్దీప్ 15 వికెట్లు, సిరాజ్ 13 వికెట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక ఈ కణాంతాలను బట్టి చూస్తుంటే ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఎంత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది అన్నది అర్థం చేసుకోవచ్చు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.