ఓడిపోతే.. మమ్మల్ని కోడిగుడ్లతో కొట్టారు : పాక్ మాజీ

praveen
ఇండియా వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నిలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా వరుస ఓటములతో తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. టైటిల్ ఫెవరేట్ గా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం గా పేరున్న పాకిస్తాన్ ఇలాంటి ప్రదర్శన చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే సొంత దేశ అభిమానులు సైతం పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా వరల్డ్ కప్ లో ఓటమికి బాధ్యత వహిస్తూ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ సైతం ఇక సారధ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఆకీబ్ జావేద్ వరల్డ్ కప్ లో ఓడిపోయి స్వదేశానికి వెళ్ళినప్పుడు.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏర్పోర్ట్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత.. జనాలు కోడిగుడ్లు కుళ్ళిన టమాటాలతో కొట్టారు అంటూ చెప్పుకొచ్చాడు.  ఆరోజు ఎయిర్పోర్టు దగ్గర బస్సు ఎక్కేటప్పుడు ప్రజలు ఎంతో ఆగ్రహంతో కనిపించారు.

 బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది  ఎయిర్పోర్టులో దిగగానే ఇక ఆరోజు చేదు అనుభవం  ఎదురయింది అంటూ చెప్పుకొచ్చాడు. మా వాళ్ళందరూ బస్సు ఎక్కేశారు. నేను వెళ్లేలోపు బస్సు వెళ్ళిపోయింది. బ్యాగుతో పరిగెడుతున్న. ఇంతలో కుళ్ళిన టమాటాలు కోడిగుడ్లు బస్సు మీద పడుతుంటే. డ్రైవర్ స్పీడ్ గా వెళ్ళాడు. చివరికి జనాలకు నేను దొరికిపోయాను. అందరి దృష్టి నా వైపుకు మళ్ళింది. దీంతో కోడిగుడ్లు కుళ్ళిన టమాటాలు నా మీద వేయడం మొదలుపెట్టారు. ఇంతలో సినిమాల్లో చూపించినట్లు.. Speed గా ఒక జీపు వచ్చింది. నా ముందు ఆగింది. నన్ను బలవంతంగా ఎక్కించారు. చాలా కంగారు పడ్డ. నా పని అయిపోయింది అని అనుకున్నా.కానీ తర్వాత చూస్తే జీప్ లో ఉన్నది నాకు కజిన్. నా టెన్షన్ చూసి నవ్వుకున్నాడు. అతను ఒక పోలీస్ ముందే తెలిసి ఎందుకని మంచిదని ఎయిర్పోర్ట్ కు దగ్గర్లో ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జనాలు మా ఇంటిని తగలబెట్టాలని చూసారూ అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈ పాకిస్తాన్ మాజీ. ఇప్పుడు పాకిస్తాన్ టీం అదృష్టవంతులు ఇంత ఘోరంగా ఓడిపోయిన ఎంతో అపురూపంగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్లారు. ఎవరిళ్ల దగ్గర వారిని ఎంతో భద్రంగా దిగబెట్టారు అంటూ అఖీబ్ జావేద్ తన ఆక్రోసాన్ని వెళ్లగక్కాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: