సచిన్ అత్యధిక పరుగుల రికార్డుపై.. కన్నేసిన విరాట్ కోహ్లీ.
వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా తన పుట్టినరోజు నాడు సెంచరీ చేసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు అన్న విషయం తెలిసిందే. భారత జట్టు సెమి ఫైనల్ ఆడుతుంది. మరో సెంచరీ చేసి సచిన్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారూ. అయితే కేవలం సెంచరీల రికార్డు మాత్రమే కాదు ఇక సచిన్ సాధించిన మరో రికార్డు పై కూడా విరాట్ కోహ్లీ కన్నేసాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో ఏకంగా ఏడు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే 2003 వరల్డ్ కప్ నాటి సచిన్ రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. 2003 వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ కనబరిచిన సచిన్ టెండూల్కర్.. ఏకంగా 673 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో 594 పరుగులతో ఉన్నాడు. కోహ్లీకి వరల్డ్ కప్ లో మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో.. ఇక 80 పరుగులు చేస్తే సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.