ఆ జట్టుతో మ్యాచ్.. టీమిండియా అస్సలు కోరుకోదు : ఇంగ్లాండ్ మాజీ
ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో భాగంగా ఎనిమిది మ్యాచ్లు ఆడిన టీం ఇండియా అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించి సత్తా చాటింది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ సీజన్ లో సెమీఫైనల్కు క్వాలిఫై అయిన మొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఇక నవంబర్ 12వ తేదీన నెదర్లాండ్స్ తో నామమాత్రమైన మ్యాచ్ ఆడబోతుంది. అయితే పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ దాదాపు నాలుగవ స్థానాన్ని కాయం చేసుకుంది. సెమీఫైనల్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఖాయం అని తెలుస్తుంది. అయితే. 2019 వరల్డ్ కప్ లో కూడా ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇక న్యూజిలాండ్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు 2019 వరల్డ్ కప్ ఓటమికి 2023లో భారత జట్టు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది అని అభిమానులందరూ కూడా భావిస్తూ ఉన్నారూ. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టివ్ హార్మిషన్ న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ లాంటి క్వాలిటీ టీం ను తక్కువగా అంచనా వేయకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడాలని భారత్ అస్సలు కోరుకోదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే పెద్ద టోర్నీలలో ఇప్పటికే ఇండియాను న్యూజిలాండ్ ఓడించిందని.. అందుకే భారత జట్టుపై ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండు మాజీ.