కెప్టెన్సీ ఉంటుందో ఊడుతుందో.. చూడాలి : బాబర్

praveen
2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ కు దాయాది దేశంగా కొనసాగుతున్న భారత్ వేదికగా ఈ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతూ ఉండడంతో పాకిస్తాన్ మరింత ప్రతిష్టాత్మకంగా ఈ వరల్డ్ కప్ ను తీసుకుంది. ఇక భారత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి ఇక చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎంతగానో ఆశపడింది. కానీ పాకిస్తాన్ జట్టు ఆశలన్ని ఆవిరి అయ్యాయి. ఎందుకంటే మొదట రెండు విజయాలు సాధించి సత్తా చాటిన  పాకిస్తాన్ ఆ తర్వాత నాలుగు పరాజయాలతో వెనుకబడిపోయింది.


 అయితే ఇటీవల బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించినప్పటికీ పాకిస్థాన్  సెమీఫైనల్ లో వెళ్లే అవకాశాలు కోల్పోయింది. ఇటీవల ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లోను  మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు పూర్తిగా గల్లంతయ్యాయి  అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రదర్శన పై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయ్. అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.


 అయితే ఇదే విషయం గురించి ఇటీవల బాబర్ ఇటీవల ఇంగ్లాండుతో మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి  వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో బాబర్ కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని డిమాండ్ వస్తుండగా ఇక ప్రెస్ మీట్ లో కూడా బాబర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్ని ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ బదులు ఇచ్చాడు. దీంతో బాబర్ వన్డే కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడు అనే ప్రచారం మొదలైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లి బోర్డుతో చర్చించిన తర్వాత బాబర్ తన నిర్ణయాన్ని ప్రకటించె అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: