ఇండియా ఓడిపోతుంది.. ఇంగ్లాండ్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఎంత విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా రాణిస్తూ వరుస విజయాలు విజయం సాధిస్తూ అదరగొడుతుంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన టీమిండియా అన్నింటిలో కూడా విజయం సాధించి సెమి ఫైనల్ అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా దూకుడును అడ్డుకునే మరో జట్టు వరల్డ్ కప్ లో కనిపించడం లేదు అని ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 భారత జట్టు టైటిల్ విజేతగా నిలవడం ఖాయమని ఎంతోమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది మాజీ ఆటగాళ్లు మాత్రం టీమిండియా గెలుపును చూసి ఓర్వలేక పోతున్నారు. దీంతో షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఎప్పుడు టీమిండియా ప్రదర్శన పై సెటైర్లు వేసే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకల్ వాన్ ఇక ఇటీవల వరల్డ్ కప్ లో టీం ఇండియా ప్రదర్శన పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫైనల్ కు వెళుతుంది అంటూ చెప్పిన మైకల్ వాన్ ఫైనల్ లో మాత్రం ఓడిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు తొలి మ్యాచ్లో ఎవరితో అయితే తలబడిందో.  చివరికి ఫైనల్ మ్యాచ్లో కూడా వాళ్లతోనే ఆడుతుంది అంటూ మైకెల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడింది. అయితే ఇలా ఫైనల్ లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని జోష్యం చెప్పాడు. భారత్ ఓడిపోయినప్పుడు తన కో కామెంటేటర్ వసీం జాఫర్ కు గిఫ్ట్ ఇస్తా.. ఇప్పటికే గిఫ్ట్ రెడీ చేసి పెట్టుకున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఇక మైకల్ వాన్ టీమిండియా పై సెటైర్లు వేయడం.. అతని సెటైర్లకు భారత మాజీ వసీం జాఫర్ కౌంటర్లు ఇవ్వడం ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగుతూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: