నెంబర్.1 ర్యాంక్ ముఖ్యం కాదు.. సిరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఇలా అగ్రస్థానంలోకి వచ్చిన టీమ్ ఇండియా ఒక అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. మూడు ఫార్మట్లలో ఒకే సమయంలో అగ్రస్థానంలో కొనసాగిన జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే కేవలం టీమిండియా మాత్రమే కాదు భారత ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. బ్యాటర్లలో గిల్ మొదటి స్థానంలోని నిలువగా ఇక బౌలర్లలో అటు సిరాజ్ మరోసారి నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. అయితే ఇలా వన్డే ర్యాంకింగ్స్ లో మళ్ళీ తనకు నెంబర్ వన్ ర్యాంకు రావడం పై సిరాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేను నా కెరియర్ లో ఎప్పుడూ ఈ ర్యాంకులను పట్టించుకోలేదు. ప్రస్తుతం ర్యాంకులు ముఖ్యం కాదు.. ప్రపంచ కప్లో భారత్ను గెలిపించడమే నాకు ఏకైక లక్ష్యం అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో భారత జట్టులో భాగమైనందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. మెగా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. ఇక రాబోయే మ్యాచ్లలో కూడా భారత జట్టు అద్భుతంగా రానిస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ ధీమా వ్యక్తం చేశాడు సిరాజ్. కాగా ఈ వరల్డ్ కప్ లో భాగంగా సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు .