బెన్ స్టోక్స్ రికార్డ్.. ఇంగ్లాండ్ చరిత్రలో ఒకే ఒక్కడు?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా కొన్ని టీమ్స్ విషయంలో అందరు అంచనాలు తారుమారు అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఇలా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసిన జట్లలో ఇంగ్లాండ్ జట్టు కూడా ఒకటి అని చెప్పాలి. ఎందుకంటే 2019లో వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండు జట్టు.. ఇక ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ అనే హోదాలో బరిలోకి దిగింది ఈ జట్టు కానీ ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే ఈ జట్టుపై తీవ్ర స్థాయిలోవిమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.


 ఏకంగా చిన్న టీమ్స్ చేతిలో కూడా ఇంగ్లాండ్ జట్టు దారుణ ఓటమి చవిచూటడంతో అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఇంగ్లాండ్ జట్టు ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజయం సాధించింది. అది కూడా భారీ తేడాతో విజయం సాధించడంతో ఇంగ్లాండుకు కాస్త ఊరట లభించింది. అయితే ఇప్పటికే అటు టోర్ని నుంచి నిష్క్రమించినప్పటికీ ఇక ఇప్పుడు విజయం మాత్రం కాస్త ఆనందాన్ని మిగుల్చుతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ స్టోక్స్.


 ఇక ఈ సెంచరీ తో ఒక అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి ఇంగ్లాండు క్రికెటర్ గా నిలిచాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. తద్వారా స్టోక్స్ పలువురు దిగ్గజాల సరసన నిలిచాడు  అని చెప్పాలి. నెదర్లాండ్స్ పై సెంచరీ చేసిన స్టోక్స్ కి వరల్డ్ కప్ లో ఇదే తొలి శతకం. అయితే ఇక అన్ని ఫార్మాట్లో కలిపి 10000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ జాబితాలో లంక దిగ్గజం తిలక రత్నే దిల్షాన్, సౌరబ్ గంగూలీ, కలిస్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు ఉన్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: