షకీబ్ ను రాళ్లతో కొడతాం.. మాథ్యూస్ బ్రదర్ వార్నింగ్?
కాగా శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్రౌండర్ మాథ్యూస్ వచ్చి బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడని అందరూ అంచనా పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలోనే అతని హెల్మెట్ స్ట్రిప్ తెగిపోవడంతో మళ్లీ హెల్మెట్ మార్చుకోవడానికి వెళ్ళాడు. ఇక ఆ సమయంలో కాస్త లేట్ కావడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేయగా అబ్బాయిలు అతన్ని టైమ్డ్ ఔట్ గా ప్రకటించారు. దీంతో ఇది కాస్త వివాదంగానే మారిపోయింది అని చెప్పాలి. షకీబ్ క్రీడా స్ఫూర్తి కి విరుద్ధంగా ప్రవర్తించాడు అని కొంతమంది విమర్శలు చేస్తుంటే.. ఐసీసీ రూల్స్ ప్రకారమే అతను తెలివిగా వ్యవహరించాడు అని మరి కొంతమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే ఇదే విషయం గురించి మ్యాథ్యూస్ సోదరుడు స్పందిస్తూ ఏకంగా బంగ్లా కెప్టెన్ షకీబ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ షకీబ్ శ్రీలంక వస్తే రాళ్లతో సన్మానం చేస్తాం అంటూ మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ హెచ్చరించాడు. షకీబ్ క్రీడా స్ఫూర్తి మరచి వ్యవహరించాడు. అందుకు అతడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక అతన్ని లంక ఫ్యాన్స్ అంత త్వరగా మరిచిపోరు అంటూ ట్రెవిన్ పేర్కొన్నాడు. అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి టైమ్డ్ ఔట్ కావడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.