సచిన్ వల్లే.. సెంచరీ చేయగలిగాను : ఆఫ్గాన్ ప్లేయర్
అయితే ఈ మ్యాచ్ లో అటు ఆస్ట్రేలియ జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ ఆఫ్గనిస్తాన్ జట్టు ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ సాధించిన సెంచరీ మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేసేసింది. ఏకంగా జట్టును అతను ఒక్కడే ముందుండి నడిపించాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో.. అతను కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఈక్రమంలోనే ఈ సెంచరీ తో ఎన్నో రికార్డులు కూడా కొల్లగొట్టాడు ఈ ఆటగాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించడం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సెంచరీ చేసిన తర్వాత ఆసక్తికర విషయాలను అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు ఇబ్రహీం. మ్యాచ్ కు ముందు రోజు టీమిండియా క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ తో మంచి సంభాషణ జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు అంతర్జాతీయ క్రికెట్లో 24 ఏళ్ల ఆయన అనుభవం తనకు ఎంతగానో నేర్పించింది అంటూ చెప్పుకొచ్చాడు. సచిన్ టెండుల్కర్ నుంచి చాలా శక్తిని విశ్వాసాన్ని కూడా పొందాను అంటూ జాద్రాన్ తెలిపాడు. ఇక ఆస్ట్రేలియా తో జరగబోయే మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన ఈ 21ఏళ్ళ బ్యాటర్ 129 పరుగులు చేశాడు.