ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్ మ్యాచ్.. డిపెండింగ్ ఛాంపియన్ పరువు నిలబడుతుందా?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని సెమి ఫైనల్ వరకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఇక ఉత్కంఠ భరితమైన సెమీఫైనల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ సెమీఫైనల్ లో బెర్త్ సంపాదించుకోవడానికి.. అన్ని టీమ్స్ కూడా హోరాహోరీగా పోరాటం చేసాయ్. కాగా మొదట టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో అడుగు పెట్టగా.. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఈ ఘనత సాధించింది. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా అటు ఆస్ట్రేలియా జట్టు కూడా సెమీఫైనల్ లో అడుగు పెట్టింది.

 కాగా ప్రస్తుతం మిగిలిన నాలుగవ స్థానం కోసం కొన్ని టీమ్స్ ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇక ఈ చివరి స్థానం కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే అటు వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ కోసం కాకుండా కేవలం పరువు నిలబెట్టుకోవడం కోసం కూడా కొన్ని మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ ఏడాది  వరల్డ్ కప్ ఎడిషన్ లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్. అయితే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుందని అందరూ అంచనాలు వేశారు. కానీ ఊహించని రీతిలో ఆ జట్టు దారుణమైన పరాజయాలను.

 ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో భాగంగా ఏడు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక విజయం మాత్రమే సాధించింది. అలాంటి ఇంగ్లాండ్ జట్టు తర్వాత రెండు మ్యాచ్లలో విజయం సాధించి.. పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. కాగా నేడు నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది ఇంగ్లాండ్. అయితే పూణే వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక నెదర్లాండ్స్ కూడా రెండు విజయాలతో ఉన్నప్పటికీ తర్వాత సెమీస్ వెళ్లే అవకాశాలు లేవు. కాబట్టి ఇక రెండు మ్యాచ్లలో భారీ విజయాలు సాధించి తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తుంది ఈ చిన్న టీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: